పచ్చి పులుసు
 • 870 Views

పచ్చి పులుసు

కావలసినవి:

 • చింతపండు -10 గ్రాములు
 • నీళ్లు - 4 కప్పులు
 • నువ్వుల పొడి - 50 గ్రాములు
 • ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు
 • కారం - అర టీ స్పూన్‌
 • ఉప్పు - తగినంత
 • కరివేపాకు - 4 రెమ్మలు
 • కొత్తిమీర - కొద్దిగా
 • ఎండుమిర్చి - 4
 • తాలింపు గిజంలు - 1 టీ స్పూన్‌
 • నూనె - 2 టీ స్పూన్లు

విధానం:

చింతపండుని నానబెట్టి రసం తియ్యాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, కారం, కొత్తిమీర, నువ్వుల పొడి, ఉప్పు వెయ్యాలి. బాండీలో నూనె వేసి కాగాక ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలతో తిరగమోత వేయాలి. దీన్ని చింతపండు రసంలో కలపాలి. అంతే పచ్చిపులుసు రెడీ. తీపి ఇష్టమైనవాళ్లు కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు.