శనగపప్పును ఉడికించాలి. చల్లారాక బెల్లంతో కలిపి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని చిన్న ఉండలుగా చేని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పాలు మరిగించి బొంబాయిరవ్వ కొద్దికొద్దిగా వేస్తూ కలిపి 2 నిముషాలు ఉడికించాలి. ఈ మిశ్రమం చల్లారాక నిమ్మకాయంత ముద్ద తీసుకొని దానిని ఒత్తి మధ్యలో శనగపప్పు పూర్ణం పెట్టి అంచులు మూని వేయాలి. వీటిని కాగిన నూనెలో ఎరగ్రా వేయించుకోవాలి.