పాలక్ కార్న్
 • 282 Views

పాలక్ కార్న్

కావలసినవి:

 • ఉడికించిన కార్న్ - 50 గ్రా.
 • ఉడికించిన పాలకూర - 250 గ్రా.
 • పచ్చిమిర్చి - 10
 • ఉల్లితరుగు - 10 గ్రా.
 • క్రీమ్ - టేబుల్ స్పూను
 • అల్లంతరుగు - 10 గ్రా.
 • వెల్లుల్లి తరుగు - 10 గ్రా.
 • మిరప్పొడి - 10 గ్రా.
 • ఉప్పు - తగినంత
 • పసుపు - చిటికెడు, నూనె - 25 గ్రా.
 • గరంమసాలా పొడి - 5 గ్రా.

విధానం:

ఒక గిన్నెలో పాలకూర తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి, చల్లారాక మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి.బాణలిలో నూనె వేసి కాగాక అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేసి కొద్దిగా వేగాక ఉల్లితరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, గరంమసాలా వేసి కలిపి, ఉడికించిన కార్న్, పాలకూర వేసి నాలుగైదు నిముషాలు ఉడికించాలి.