ముందుగా పాలకూరను మెత్తగా ఉడికించి, చల్లారిన తరవాత కొద్దిగా ఉప్పు జత చేసి మెత్తగా పేస్ట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. పాన్‌లో టీ స్పూను నూనె కాగిన తరవాత అందులో జీలకర్ర వేసి దోరగా వేగాక మైదా వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి దింపి, ఈ మిశ్రమాన్ని పాలకూర పేస్ట్‌లో వేసి కోఫ్తా(బాల్స్ మాదిరి)లా తయారుచేసుకోవాలి. పాన్‌లో నూనె కాగిన తరవాత అందులో ఈ కోఫ్తాలను డీప్ ఫ్రై చేసి తీసి పక్కన ఉంచుకోవాలి. జీడిపప్పులో తగినంత నీరు పోసి పేస్ట్ (మరీ పల్చగా ఉండకూడదు) చేయాలి. ఒక పాన్‌లో ఈ పేస్ట్ వేసి కొద్దిగా ఉడికిన తరవాత ఏలకులపొడి, ధనియాలపొడి, కసూరీ మేథీ, స్వీట్ క్రీమ్ వేసి రెండు నిముషాలు ఉడికించితే గ్రేవీ తయారవుతుంది. ఇందులో పాలక్ కోఫ్తాలు వేసి ఐదునిముషాలు ఉంచితే పాలక్ కాశ్మీర్ కోఫ్తా రెడీ అయినట్లే.