గోధుమపిండిలో పాలక్ప్యూరీ, ఉప్పు, జీలకర్రపొడి వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండి మరికాస్త మెత్తగా రావాలనుకుంటే కొద్దిగా నీరు కలుపుకోవచ్చు. ఘాటుగా ఉండాలనుకునేవారు కారం, గరం మసాలా, అర టీ స్పూన్ సోంపు పొడి వేసి కలుపుకోవచ్చు. ముద్దగా చేసిన పిండిని చిన్ని చిన్న బాల్స్ చేసుకొని పూరీని వత్తాలి. నూనె వేడయ్యాక అందులో వేసి రెండువైపులా కాల్చాలి. చోలే తో పాలక్ పూరీలను వేడివేడిగా వడ్డించాలి.