ముందుగా పల్లీలను నూనె లేకుండా వేయించి పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, కరివేపాకు, ఉప్పు, మిరపపొడి, గరం మసాలా, ధనియాలపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు, వేయించి ఉంచుకున్న పల్లీలు, తగినంత నీరు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి. బాణలిలో నూనె కాగిన తరవాత పల్లీలను పకోడీల మాదిరిగా నూనెలో వేసి కరకరలాడే వరకు వేయించి, టిష్యూ పేపర్ మీదకు తీసుకోవాలి. పల్లీ పకోడీ పల్లీ చట్నీ కాంబినేషన్‌తో సర్వ్ చేయాలి.