పల్లీ పకోడీ
  • 587 Views

పల్లీ పకోడీ

కావలసినవి:

  • పల్లీలు - రెండు కప్పులు
  • శనగపిండి - ఒకటిన్నర కప్పులు
  • కరివేపాకు - మూడు రెమ్మలు
  • నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
  • ఉప్పు - తగినంత
  • మిరపపొడి - టీ స్పూను
  • ధనియాలపొడి - అర టీ స్పూను
  • గరంమసాలా - అర టీ స్పూను
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - పావు టీ స్పూను
  • కొత్తిమీర - చిన్న కట్ట

విధానం:

ముందుగా పల్లీలను నూనె లేకుండా వేయించి పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, కరివేపాకు, ఉప్పు, మిరపపొడి, గరం మసాలా, ధనియాలపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు, వేయించి ఉంచుకున్న పల్లీలు, తగినంత నీరు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి. బాణలిలో నూనె కాగిన తరవాత పల్లీలను పకోడీల మాదిరిగా నూనెలో వేసి కరకరలాడే వరకు వేయించి, టిష్యూ పేపర్ మీదకు తీసుకోవాలి. దీనిని పల్లీ చట్నీ కాంబినేషన్‌తో సర్వ్ చేయాలి.