ముందుగా పల్లీలను ఉడికించి పక్కన ఉంచుకోవాలి. ఒక బాణలిలో నూనె వేసి అందులో ఉల్లితరుగు, పసుపు, పచ్చిమిర్చితరుగు, కరివేపాకు వేసి బాగా కలిసిన తరవాత పల్లీలను వేసి మరోమారు కలపాలి. తరవాత ఇందులో కొబ్బరితురుము, చింతపండుగుజ్జు కూడా వేసి రెండునిముషాలపాటు కలిపి దింపేయాలి. చివరగా పల్లీ సలాడ్ని కరివేపాకుతో గార్నిష్ చేసి సర్వ్చేయాలి.