పంచామృతం
 • 335 Views

పంచామృతం

కావలసినవి:

 • కమలాలు - 2
 • తర్బూజా ముక్కలు - 1 కప్పు
 • ఖర్జూరాలు - 12
 • కిస్‌మిస్‌ - 16
 • కొబ్బరి కోరు - 5 స్పూన్లు
 • పెరుగు - 2 కప్పులు
 • పాలు - 2 కప్పులు
 • కొబ్బరి కాయనీరు - 1కాయది
 • తేనె - 5 స్పూన్లు
 • పంచదార - 5 స్పూన్లు
 • ఉప్పు - అర స్పూను
 • అరటిపండ్లు - 2
 • మిరియాలపొడి - 1 స్పూన్‌
 • పుచ్చకాయ ముక్కలు - 1 కప్పు

విధానం:

కమలాపండ్లను తొనలు, తర్బూజా, అరటి పండ్లను ముక్కలు చేసుకోవాలి. ఈ ముక్కలన్నింటినీ ఓ పాత్రలో తీసుకుని వాటిపై ఉప్పు, పంచదార, మిరియాల పొడి చల్లాలి. తర్వాత పాలు, కొబ్బరి నీళ్లు, పెరుగు, తేనె ఒక దాని తర్వాత మరొకటి పోయాలి. అన్నింటినీ కలిపి అరగంట ఫ్రిజ్‌లో పెట్టాలి. తినేముందు ఖర్జూర ముక్కలు, కిస్‌మిస్‌, కొబ్బరికోరు పైన చల్లుకుంటే చాలు. ఎంతో రుచికరమైన పండ్ల పంచామృతం రెడీ.