పనీర్ ముక్కలను కొద్దిగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు, గసాలు, జీడిపప్పు పేస్ట్ చేసి ఉంచుకోవాలి. దాన్ని నూనెలో వేయించి టమాటా జ్యూస్‌ను కలపాలి. దానిలో గరమ్ మసాలా, కారం వేసి కొంచెం నీళ్లు పోసి 2 నిమిషాలు ఉడికించాలి. తర్వాత పనీర్ ముక్కలు కలిపి కొద్దిగా ఉడికించి, వెన్న వేయాలి. అంతే పనీర్ బటర్ మసాలా రెడీ.