పనీర్ పకోడా
  • 474 Views

పనీర్ పకోడా

కావలసినవి:

  • పనీర్ - 100 గ్రా.
  • శనగపిండి - 150గ్రా.
  • కారం - అర టీ స్పూను
  • పచ్చిమిర్చి - 6,
  • నూనె - డీప్‌ఫ్రైకి సరిపడా
  • ఉప్పు - తగినంత
  • వంటసోడా - పావు టీ స్పూను
  • చాట్ మసాలా - అర టీస్పూను

విధానం:

పనీర్‌ను మందంగా, పొడవుగా కట్ చేయాలి. ఒక్కొక్క దాని మీద కొద్దికొద్దిగా కారం, చాట్ మసాలా చల్లి పక్కనుంచాలి. ఒక పాత్రలో శనగపిండి, కొద్దిగా నీరు, ఉప్పు, వంటసోడా, కారం వేసి బజ్జీలపిండి మాదిరిగా కలపాలి. స్టౌ మీద పాత్రలో నూనె వేడయ్యాక పనీర్ ముక్కలను ఈ పిండిలో ముంచి నూనెలో వేసి వేయించాలి. ఇవి గ్రీన్ చట్నీతో తింటే బావుంటాయి.