పనీర్‌ సమోసా
  • 456 Views

పనీర్‌ సమోసా

కావలసినవి:

  • మైదాపిండి-కప్పున్నర,
  • నూనె-కొద్దిగా,
  • జీలకర్ర- చెంచా,
  • పచ్చిమిర్చి-రెండు,
  • ఉల్లిపాయ- ఒకటి,
  • క్యారెట్‌- ఒకటి,
  • పచ్చి బఠాణీలు - అర కప్పు,
  • జీలకర్ర పొడి- చెంచా,
  • ఉప్పు, కారం- తగినంత,
  • చాట్‌ మసాలా-అర కప్పు

విధానం:

బఠాణీలు బంగాళదుంపల్ని విడివిడిగా ఉడికించి చేత్తో మెత్తగా మెదపాలి. తరువాత పొయ్యి మీద బాణలి పెట్టి అందులో నూనె వేడి చేసి జీలకర్ర, పచ్చి మిర్చి, ఉల్లిపాయ, క్యారెట్‌ తరుగు, బఠాణీ, బంగాళదుంప మిశ్రమం వేసి వేయించాలి. తరువాత పనీర్‌ తురుము, జీలకర్ర పొడి, కారం, చాట్‌ మసాలా, ఉప్పు వేసి మగ్గించి దించేయాలి. ఒక గిన్నెలోకి మైదా పిండి తీసుకొని చెంచా నూనె, తగినంత ఉప్పు చేర్చి చపాతీ పిండిలా కలపాలి. చిన్నచిన్న ఉండలుగా చేసి చపాతీలా ఒత్తుకొని దాన్ని కోన్‌ మాదిరి చేసి అందులో పనీర్‌ మిశ్ర మాన్ని ఉంచి సమోసాలా మడ త పెట్టాలి. తరువాత బాణ లిలో నూనె వేడి చేసి సమోసా లను గోధుమ వర్ణంలోకి వచ్చే వరకు వేయించి తీస్తే సరిపో తుంది. వేడి వేడీ పనీర్‌ సమోసా లను టమాటా సాస్‌ లేదా గ్రీన్‌ చట్నీతో తింటే రుచిగాఉంటాయి.