పాపడ్ కర్రీ
 • 370 Views

పాపడ్ కర్రీ

కావలసినవి:

 • వేయించిన అప్పడాలు- పది
 • ఉల్లిపాయ- ఒకటి (తరగాలి)
 • టొమాటో - ఒకటి (తరగాలి)
 • తరిగిన కొత్తిమీర - రెండు టేబుల్ స్పూన్లు
 • అల్లం వెల్లుల్లి పేస్టు- పావు టీ స్పూన్
 • చక్కెర - చిటికెడు
 • నూనె - రెండు టేబుల్ స్పూన్లు
 • జీలకర్ర - టీ స్పూన్
 • ఆవాలు - అర టీ స్పూన్
 • ఉప్పు - తగినంత
 • మిరప్పొడి - పావు టీ స్పూన్

విధానం:

బాణలిలో నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి వేగిన తరవాత ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర వేసి అవి వేగిన తరవాత అల్లం వెల్లులి పేస్టు, చక్కెర, ఉప్పు, మిరప్పొడి వేసి రెండు నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు అప్పడాలను నలిపి బాణలిలో వేసి కొద్దిగా నీటిని వేసి సన్న మంట మీద రెండు నిమిషాలు ఉడికించి వేడిగా వడ్డించాలి.