ఖట్టామీఠా పాపడ్ పకోడీ
  • 339 Views

ఖట్టామీఠా పాపడ్ పకోడీ

కావలసినవి:

  • శనగపిండి - పావు కప్పు
  • ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు
  • టొమాటో ముక్కలు - పావు కప్పు
  • చక్కెర - పావు టీ స్పూన్
  • టొమాటో సాస్ - రెండు టేబుల్ స్పూన్లు
  • ఉప్పు - అర టీ స్పూన్
  • మిరప్పొడి - పావు టీ స్పూన్
  • వేయించిన అప్పడాలు - నాలుగు
  • జీలకర్ర - అర టీ స్పూన్
  • సోడా బై కార్బనేట్ - చిటికెడు
  • నూనె - వేయించడానికి తగినంత

విధానం:

వెడల్పుగా ఉన్న పాత్రలో శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, చక్కెర, టొమాటో సాస్, ఉప్పు, మిరప్పొడి, జీలకర్ర, సోడా వేసి కలిపి అందులో తగినంత నీరు పోసి ముద్ద చేసి చివరగా అప్పడాలను చిదిమి అందులో కలపాలి. బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత పిండి మిశ్రమాన్ని పకోడీలుగా వేసి దోరగా కాల్చాలి. ఖట్టామీఠా పాపడ్ పకోడీని టొమాటో సాస్‌తో వేడిగా సర్వ్ చేయాలి.