బొప్పాయి జ్యూస్
  • 448 Views

బొప్పాయి జ్యూస్

కావలసినవి:

  • బొప్పాయి పండు... ఒకటి
  • పంచదార... రెండు గ్లాసులు
  • యాలకుల పొడి... రెండు టీ.
  • పుదీనా ఆకులు... కాసిన్ని

విధానం:

బొప్పాయిపండును శుభ్రంగా కడిగి పై చెక్కును తీయాలి. చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి గుజ్జు తయారు చేయాలి. రెండు గ్లాసుల పంచదార, యాలకుల పొడి, పుదీనా ఆకుల ముక్కలను గుజ్జులో కలుపుకోవాలి. పంచదార పూర్తిగా కరిగేలా కలియదిప్పి గ్లాసుల్లో పోసి పైన ఐస్‌క్యూబ్స్ వేసి సర్వ్ చేయాలి. ఈ జ్యూస్ ఎండవేడిమి నుంచి శరీరానికి రక్షణనిస్తుంది, మంచి ఆరోగ్యకరమైనది కూడా...!! పంచదార కలుపకుండా చేసే బొప్పాయి జ్యూస్‌ను చక్కెర వ్యాధితో బాధపడేవారికి కూడా ఇవ్వవచ్చు.