పైన చెప్పిన పప్పు పదార్థలను నూనె లేకుండా వేయించుకుని పొడి చేసుకుంటే పప్పులపొడి సిద్ధమవుతుంది. చింతపండు ఉడికించి గుజ్జు తీసుకుని ఉంచుకోవాలి. బాణలిలో నూనె కాగాక పోపు సామాను వేసి దోరగా వేగిన తరవాత అందులో చింతపండు గుజ్జు వేసి ఉడికించుకోవాలి. అన్నంలో ఈ పోపు సామాను, పప్పులపొడి, ఉప్పు వేసి బాగా కలిపి అరగంట తరవాత సర్వ్ చేసుకోవాలి.