ఎగ్‌ పరోటా కర్రీ
 • 540 Views

ఎగ్‌ పరోటా కర్రీ

కావలసినవి:

 • పరోటాలు - 2
 • జీలకర్ర - 2 స్పూన్లు
 • ఉప్పు - తగినంత
 • కారం - 1 స్పూను
 • గుడ్లు - 2
 • సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
 • టమాటా ముక్కలు - అర కప్పు
 • మిరియాల పొడి - అర టీ స్పూను
 • ధనియాల పొడి - అర టీ స్పూను
 • పసుపు - పావు టీ స్పూను
 • కొత్తిమీర తురుము - 2 టీ స్పూన్లు
 • నూనె - 3 టేబుల్‌ స్పూన్లు

విధానం:

నూనె వేడి చేసి జీలకర్ర, ఉల్లి, టమాటా ముక్కలు దోరగా వేయించాలి. అందులోనే పరోటా ముక్కలూ వేయించాలి. కారం, ఉప్పు, పసుపు, మిరియాల పొడి, ధనియల పొడి కలిపి సన్న సెగమీద ఈ మిశ్రమాన్ని ఉడికించాలి. అందులో కోడిగుడ్ల సొన కలపాలి. గుడ్డు సొన పూర్తిగా ఉడికిన తర్వాత పైన కొత్తిమీర చల్లితే చాలు. ఇష్టమైన వారు దీనిపైన టమాటా సాస్‌/చిల్లీసాస్‌ వేసుకోవచ్చు.