పసర, కోవా స్వీట్‌
  • 383 Views

పసర, కోవా స్వీట్‌

కావలసినవి:

  • పంచదార - పావు కిలో
  • పెసరపప్పు - పావు కిలో
  • పాలు - పావు లీటరు
  • కోవా - అర కప్పు
  • జీడిపప్పు, బాదంపప్పు,కిస్‌మిస్‌ - పావు కప్పు
  • యాలకుల పొడి - అర స్పూన్‌
  • నెయ్యి - 100 గ్రాములు
  • కుంకుమ పువ్వు/మిఠాయి రంగు - కొద్దిగా

విధానం:

బాదంపప్పు నానబెట్టి పొట్టు తీసెయ్యాలి. జీడిపప్పు, కిస్‌మిస్‌ నేతిలో వేయించాలి. నానబెట్టిన పెసరపప్పు ఉడికించి మెత్తగా రుబ్బాలి. బాండీలో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో రుబ్బిన పెసరపప్పు మిశ్రమం, పాలు, పంచదార వరుసగా వేసి కలపాలి. ఈ మిశ్రమం ఉడికాక కోవా, యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌ మిఠాయి రంగు/కుంకుమ పువ్వు వేసి కలపాలి. ఐదు నిమిషాల తర్వాత స్టౌమీద నుండి దించి నెయ్యి రాసిన పళ్లెంలో పొయ్యాలి. పైన బాదం పప్పులతో అలంకరించుకుని నచ్చిన ఆకారంలో కోసుకుంటే చాలు. పెసర, కోవా స్వీటు రెడీ