ష్రింప్ విత్ పాస్తా
  • 350 Views

ష్రింప్ విత్ పాస్తా

కావలసినవి:

  • పాస్తా - కప్పు,
  •  ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు,
  •  వెల్లుల్లి రేకలు- 3,
  • ఉల్లితరుగు - పావు కప్పు,
  • ష్రింప్ (రొయ్యలు) - అర కప్పు,
  • మిరియాల పొడి - పావు టీ స్పూను,
  • టొమాటో తరుగు - అర కప్పు,
  • బేసిల్ ఆకులు - 10 (సూపర్ మార్కెట్‌లో దొరుకుతాయి),
  • రెడ్ క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు,
  • తాజా క్రీమ్ - కప్పు,
  • పర్మేసన్ చీజ్ - టేబుల్
  • స్పూను, ఉప్పు - తగినంత.

విధానం:

ఒక పాత్రలో తగినంత ఉప్పు, నీళ్లు వేసి మరిగించాలి. పాస్తా జత చేసి, ఉడికించి, వడ కట్టాలి (కప్పుడు నీటిని పక్కన ఉంచాలి). పెద్ద బాణలిలో ఆలివ్ ఆయిల్ వేసి కాగాక ముందుగా వెల్లుల్లి రేకలు, ఉల్లి తరుగు, రొయ్యలు వేసి దాని మీద మిరియాల పొడి, చిటికెడు ఉప్పు వేసి కలిపి మూత ఉంచి, రెండు నిమిషాలు ఉడికించాలి. బాగా కలిపి మరో రెండు నిమిషాల తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. అదే బాణలిలో ఉడికించిన పాస్తా వేసి అడుగు అంటకుండా కలుపుతుండాలి.
 టొమాటో తరుగు, సగం బేసిల్ ఆకులు, రెడ్ క్యాప్సికమ్ తరుగు, తగినంత ఉప్పు, పర్మేసన్ చీజ్ వేసి పదార్థాలన్నీ కొద్దిగా దగ్గరపడే వరకు ఉడికించాలి. క్రీమ్ జత చేసి రెండు నిమిషాలు ఉడికించాలి. ఉడికించి ఉంచుకున్న రొయ్యలు, పక్కన ఉంచుకున్న కప్పుడు నీళ్లు, ఉప్పు జత చేయాలి . మిగిలిన బేసిల్ ఆకులు వేసి కలిపి వేడివేడిగా అందించాలి.