మైదా, గోధుమపిండిలను ఒక పాత్రలో వేసి కలిపి అందులోనే గోధుమ నూక, యాలకులపొడి, పంచదార, కొబ్బరిముక్కలు, తినే సోడా వేసి పాలు పోసి పునుగుల పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి గరిటెతో లేదా చేత్తోనే పిండి తీసుకుని కావలసిన సైజులో నూనెలో వెయ్యాలి. అవి పొంగి ఎర్రగా వేగిన తరువాత చిల్లులగరిటెతో తీయాలి. అంతే పాల పువ్వులు రెడీ..! ఉత్తరాదిలో చేసే ఈ పాల పువ్వులు నాలుగురోజులుదాకా నిల్వ ఉంటాయి.