బఠాణీ మష్రూమ్స్‌
 • 337 Views

బఠాణీ మష్రూమ్స్‌

కావలసినవి:

 •  పచ్చిబఠాణీలు-ఒకటిన్నర కప్పు,
 • పుట్టగొడుగులు-200 గ్రాములు,
 • ఉల్లిపాయలు-రెండు,
 • టొమా టోలు-నాలుగు,
 • కారం-టేబుల్‌ స్పూను,
 • ధనియాల పొడి-టేబుల్‌ స్పూను,
 • పసుపు-టీ స్పూను,
 • గరం మసాలా-టీ స్పూను,
 • జీడిపప్పు ముద్ద-అర కప్పు,
 • యాలకులు-నాలుగు,
 • దాల్చిన చెక్క-అంగుళం ముక్క,
 • అల్లం వెల్లుల్లి-2 టేబుల్‌ స్పూన్లు,
 • నూనె-4 టేబుల్‌ స్పూన్లు,
 • ఉప్పు- రుచికి సరిపడా.

విధానం:

తయారు చేయు విధానం పుట్టగొడుగుల్ని కడిగి ముక్కలుగా కోయాలి. బాణలిలో నూనె వేసి యాలకులు, దాల్చిన చెక్క, ఉల్లి ముక్కలు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి వేసి ఓ నిమిషం వేయించాలి. టొమాటో ముక్కలు కూడా వేసి ఉడికించాలి. తరువాత కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి ఓ రెండు నిమిషాలు ఉడికించాలి. జీడిపప్పు ముద్దని ఓ కప్పు నీళ్లలో కలిపి బాణలిలో పోయాలి. తరువాత మరో కప్పు నీళ్ళు పోసి మరిగించాలి. ఇప్పుడు బఠాణీలు, పుట్టగొడుగులు వేసి ఉడికిన తరువాత దించాలి.