చింతపండు పది నిమిషాలు నానబెట్టి రసం తీయాలి. ఆ రసంలో టమాటాలు మెదిపి వడకట్టాలి. వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర కలిపి మెత్తగా నూరుకోవాలి. బాండీలో నూనె వేసి కాగాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. అందులో చింతపండు, టమాటా రసం పోసి ఒక పొంగు రానివ్వాలి. తర్వాత వెల్లుల్లి, జీలకర్ర, మిరియాల ముద్ద, పసుపు, ఉప్పు వేసి మళ్లీ ఒక పొంగురానివ్వాలి. ఈ రసం జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది