పన్నీరు జిలేబీ
  • 316 Views

పన్నీరు జిలేబీ

కావలసినవి:

  • పన్నీర్‌ : అరకిలో,
  • మైదా :100గ్రా,
  • పంచదార : అర కిలో,
  • రోజ్‌/కెవ్డా ఎసెన్స్‌ : టీ స్పూన్‌;
  • యాలకుల పొడి : టీ స్పూన్‌,
  • పిస్తా పప్పు ముక్కలు : టేబుల్‌ స్పూన్‌,
  • పాలు : సరిపడా,
  • బేకింగ్‌ పౌడర్‌ : చిటికెడు,
  • నెయ్యి లేదా నూనె : వేయించడానికి సరపడా

విధానం:

పన్నీర్‌ని మెత్తగా రుబ్బి బేకింగ్‌ పౌడర్‌, తగినన్ని పాలు పోసి చపాతీ పిండిలా కలపాలి. పంచదారలో 2 కప్పుల నీళ్లు పోసి సన్నని తీగపాకం రానివ్వాలి. ఇప్పుడు స్టవ్‌ ఆఫ్‌ చేసి ఎసెన్స్‌, యాలకుల పొడి కలపాలి. కావాలంటే ఆరెంజ్‌ కలర్‌ కూడా వేసుకోవచ్చు. బాణలిలో నెయ్యి పోసి కాగనివ్వాలి. ఇప్పుడు పన్నీర్‌ మిశ్రమాన్ని చేత్తోనూ లేదా లావుపాటి చక్కిడాల గొట్టంతో చుట్టలుగా చుట్టుకుని కాగిన నేతిలో వేసి సన్నని మంట మీద వేయించి పాకంలో వేసి 10 నిమిషాలు ఉంచి తీయాలి. వీటి మీద పిస్తా ముక్కలు చల్లి అందించాలి.