పెరుగు గారెల
  • 434 Views

పెరుగు గారెల

కావలసినవి:

  • పెరుగు - అర లీటరు
  • మినప్పప్పు - పావుకిలో
  • పచ్చి మిర్చి - 6
  • అల్లం - అంగుళం ముక్క
  • ఉప్పు - తగినంత
  • కరివేపాకు - 5 రెమ్మలు
  • పోపు సామాను - 2 టేబుల్‌ స్పూన్లు
  • నూనె - అర కిలో

విధానం:

మామూలు గారెలకు నానబెట్టినట్టే మినప్పప్పు నానబెట్టి శుభ్రంగా కడిగి అందులో కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. పెరుగు గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు గానీ మజ్జిగ గానీ కలిపి పల్చగా చేసుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, కరివేపాకు మెత్తగా నూరి ఈ మజ్జిగలో కలిపి పోపు పెట్టుకోవాలి. బాండీలో నూనె వేసి బాగా కాగిన తర్వాత రుబ్బి పెట్టుకున్న పిండిని గారెల్లా చేసుకుని పక్కనే పెట్టుకున్న పోపు వేసిన పెరుగులో వేసుకోవాలి. ఈ గారెలు పెరుగులో కొద్దిగా నానిన తర్వాత తింటే చాలా బావుంటాయి.