పెసర లడ్డూలు
  • 380 Views

పెసర లడ్డూలు

కావలసినవి:

  • ఛాయపెసరపప్పు - 1 కేజీ
  • పంచదార - 1 కేజీ
  • నెయ్యి - 400 గ్రాములు
  • జీడిపప్పు - 50 గ్రాములు
  • యాలకులు - 6,
  • నీళ్లు - తగినన్ని
  • పచ్చకర్పూరం - చిటికెడు

విధానం:

పెసరపప్పు వేయించి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. పంచదారలో సరిపడా నీళ్లు పోసి తీగపాకం వచ్చేవరకు ఉడికించాలి. అందులో పచ్చకర్పూరం, యాలకుల పొడి వేసి కలపాలి. ఆ తర్వాత పెసరపొడి, కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ బాగా కలిపి దించాలి.అందులోనే నేతిలో వేయించిన జీడిపప్పు పలుకులు కలపాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇవి ఒక రోజు తర్వాత తింటే చాలా రుచిగా ఉంటాయి.