పూర్ణం బూరెలు
  • 502 Views

పూర్ణం బూరెలు

కావలసినవి:

  • శెనగపప్పు  : 2 కప్పులు
  • బెల్లం  : 2 కప్పులు
  • యాలకుల పొడి : 1/2 టీస్ఫూన్‌
  • మినప్పప్పు  : 1 కప్పు
  • బియ్యం  : 2 కప్పులు
  • నెయ్యి  : 1/2 కప్పు
  • నూనె  : వేయించడానికి

విధానం:

మినప్పప్పు, బియ్యం కడిగి సరిపడా నీళ్లు పోసి కనీసం నాలుగైదు గంటలు నానబెట్టాలి. తరువాత మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. శెనగపప్పు కుక్కర్‌లో తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. ఇందులో తరిగిన బెల్లం వేసి కలిపి మళ్లీ ఉడికించాలి. ఈ మిశ్రమంలో తడి పూర్తిగా పోయేవరకు ఉడికించాలి. లేకుంటే వేయించేటప్పుడు విడిపోయి నూనెలో కలిసిపోతుంది. చివరలో యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి దింపేయాలి. చల్లారిన తర్వాత నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి. బాణలిలో నూనె వేడి చేయాలి. ఒక్కో ఉండను మినప్పప్పు, బియ్యం మిశ్రమంలో పూర్తిగా ముంచి నూనెలో వేయాలి. ఇలాగే మరికొన్ని చేసుకొని బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇవి రెండు మూడు రోజులు నిలువ ఉంటాయి.