పైనాపిల్‌ బిస్కెట్స్‌
  • 558 Views

పైనాపిల్‌ బిస్కెట్స్‌

కావలసినవి:

  •  :మైదా - అరకిలో
  • బేకింగ్‌ పౌడర్‌ - ఒక స్పూను
  • చక్కెర - 200గ్రా
  • తినే సోడా - కొద్దిగా
  • పైనాపిల్‌ ఎసెన్స్‌ - ఒక స్పూను
  • కోడి గుడ్లు - రెండు
  • వెన్న - 100గ్రా

విధానం:

చక్కెరను మెత్తగా పొడిలా చేసుకోవాలి. మైదా పిండిని జల్లించుకోవాలి. ఒక గిన్నె తీసుకుని అందులో గుడ్లు పగులగొట్టి తెల ్లసోనాను మాత్రం తీసుకోవాలి. దీనిని ఎగ్‌ బీటర్తో కానీ గ్రైండర్‌లో కానీ వేసి బాగా కలపాలి. మైదాను రాత్రి పూటకానీ పొద్దు నకానీ తడిపి బాగా మృదువుగా అయ్యేలా కలుపుకోవాలి. ఉదయం చేసేట్లు అయితే పిండిని ముందు రోజు రాత్రి, సాయంత్రం చేసుకోవాలనుకుంటే ఉదయంపూట పిండిని తడిపి వుంచుకోవా లి. అలా చేస్తేనే బిస్కెట్స్‌ గుల్లగా వుండి కరకరలాడుతుంటాయి. ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో కోడి గుడ్డును పగుల గొట్టి వేయాలి.

దానిలో చక్కెర పొడిని వేసి బాగా కలియబెట్టాలి. మైదాపిండిలో బేకింగ్‌ సోడా, వెన్న వేసి కలపాలి. తరువాత గుడ్డు సోనాలో పైనాపిల్‌ ఎస్సెన్సు వేసి బాగా బ్లెండ్‌ చేసి దీన్ని మైదా పిండిలో వేసి కలపాలి. చక్కెర మిశ్రమంలో దీన్నంతటిని వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని నాలుగు లేదాఐదు గంటల పాటుపక్కన వుంచుకోవాలి. తరువాత వాటిని పూరీల్లా వత్తుకోవాలి. వీటిని నచ్చిన ఆకారంలో ట్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కేక్‌ పాన్‌ తీసుకుని అందులో ప్రత్యేకంగా వుండే గిన్నెలో బిస్కెట్స్‌ను పెట్టి బేక్‌ చేయాలి. లేత బంగారు రంగు వచ్చే వరకు అలా వుంచేయాలి. పైనాపిల్‌ బిస్కెట్స్‌ రెడీ.