పైనాపిల్ చెక్కు తీసి చక్రాలుగా తురుముకోవాలి. ఓ పాత్రలో కొంచెం నీరు పోసి అందులో ముక్కలను వేసి సన్నని మంట మీద ఉడికించాలి. అందులో పసుపు,కారం, ఉప్పు వేయండి. బెల్లం సన్నగా తురమండి. కొబ్బరి కోరులో జీలకర్ర, ఆవాలు కలిపి మెత్తని ముద్దగా నూరండి. ఎండు మిరపకాయలు విడిగా నూరి ముద్ద చేసుకోండి. ఉడుకుతున్న పైనాపిల్ ముక్కలు మెత్తబడగానే బెల్లం వేసి గంటెతో కలుపుతూ ఉండండి. ద్రావణం చిక్కబడతుండగా కొబ్బరి ముక్క ఎండు మిర్చి ముద్ద, కరివేపాకు వేసి బాగా కలిపి దించండి.సిద్ధమైన పైనాపిల్ పచ్చడిని బ్రెడ్ టోస్టులతో కలిపి వడ్డించండి.