పైనాపిల్‌ షర్బత్‌
  • 306 Views

పైనాపిల్‌ షర్బత్‌

కావలసినవి:

  • పైనాపిల్‌ జ్యూస్‌ - 2 కప్పులు
  • నిమ్మరసం - 1 గరిటెడు
  • పంచదార పొడి - 1 కప్పు
  • నీళ్ళు - 2 కప్పులు
  • గులాబి రేకులు - 1/2 కప్పు
  • ఐస్‌ ముక్కలు కొన్ని (అవసరమనుకుంటే)

విధానం:

గులాబి రేకుల్ని 1 కప్పు నీళ్లలో నానబెట్టాలి. వీటిని గ్రైండ్‌ చేసి వడగట్టాలి. పంచదారలో కొన్ని నీళ్లు పోసి మరిగించాలి. మంట తగ్గించి ఐదు నిమిషాలు ఉడికిన తరువాత స్టౌమీద నుంచి తీసి చల్లార్చాలి. ఇందులో రోజ్‌వాటర్‌, నిమ్మరసం, పైనాపిల్‌ రసం కలపాలి. దీన్ని ఫ్రీజర్‌లో పెట్టి తరువాత బయటికి తీసి స్మూత్‌గా అయ్యే వరకు బీట్‌ చేసి ఫ్రీజర్‌లో పెట్టాలి. మళ్లీఒకసారి తీసి బీట్‌ చేసి తిరిగి ఫ్రీజర్‌లో పెట్టాలి. ఈసారి బయటికి తీసి స్కూప్స్‌తో బౌల్‌లోకి తీసుకుని గార్నిష్‌ చేసి సర్వ్‌్‌ చెయ్యండి.