పైనాపిల్ అప్‌సైడ్ డౌన్ కేక్
  • 313 Views

పైనాపిల్ అప్‌సైడ్ డౌన్ కేక్

కావలసినవి:

  • మైదా - 200 గ్రా.,
  • బేకింగ్ పౌడర్-అర టీ స్పూను,
  • వంటసోడా-అర టీ స్పూను,
  • వెన్న - 200 గ్రా.,
  • పంచదార - 200 గ్రా.,
  • పైనాపిల్ ఎసెన్స్ - 6 చుక్కలు,
  • పైనాపిల్ ముక్కలు - 8,
  • చెర్రీలు - 8

విధానం:

కేక్ చేసే టిన్నులో మూడు చెంచాల పంచదార వేసి వేడి చేయాలి. అది కరిగి ఎరగ్రా అవుతుంది. ఆ పాకాన్ని గిన్నెకంతా రాసి ఉంచాలి. మైదాలో బేకింగ్ పౌడర్, వంటసోడా వేసి రెండుమూడు సార్లు జల్లించాలి. పైనాపిల్ చెక్కు తీసి సన్నని, గుండ్రటి స్లైసులుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో వెన్న, పంచదార వేసి కరిగేవరకు బాగా కలపాలి. ఇందులో కోడిగుడ్డు పచ్చసొన వేసి కలపాలి. తెల్లసొనని విడిగా నురగ వచ్చేలా గిలకొట్టాలి. ఈ వెన్న మిశ్రమంలో గుడ్ల మిశ్రమం, మైదాపిండిని ఒకదాని తరవాత ఒకటి వేసి కలుపుతూండాలి. చివరలో ఎసెన్స్ వేసి కలపాలి. క్యారమిల్ సిరప్ రాసిన కేక్ టిన్నులో పైనాపిల్ ముక్కలు దగ్గరదగ్గరగా పెట్టాలి. వీటి మధ్యభాగంలో చిన్నముక్క తీసేసి అక్కడ చెర్రీపళ్లు పెడితే బావుంటుంది. కలిపి ఉంచుకున్న కేక్ మిశ్రమాన్ని వేసి సమానంగా పరవాలి. ముందే వేడి చేసుకున్న ఓవెన్‌లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర 50 నిముషాల పాటు బేక్ చేయాలి. చల్లారిన తరవాత టిన్నును ఒక పళ్లెంపై పెట్టి తిరగేసి కేక్‌ను బయటకు తీస్తే పైనాపిల్ ముక్కలు పైకి కనపడుతూ కేక్ తయారవుతుంది. అడుగున పెట్టిన పళ్లముక్కలు పైకి వస్తాయన్నమాట.