అరటికాయ పప్పుకూర
  • 463 Views

అరటికాయ పప్పుకూర

కావలసినవి:

  • అరటికాయలు - రెండు
  • సెనగపప్పు - 100గ్రాములు
  • పచ్చిమిర్చి - ఆరు
  • కారం పొడి - మూడు టీ స్పూన్లు
  • నూనె, ఉప్పు తగినంత
  • ఉల్లిపాయలు - రెండు

విధానం:

నానబెట్టిన సెనగపప్పునుగానీ కందిపప్పును గానీ పచ్చిమిర్చి, ఇంగువ పొడులను కలిపి మిక్సిలో రుబ్బి పక్కన పెట్టండి. బాణలి వేడెక్కిన తర్వాత అందులో నూనె పోసి ఆవాలు, ఉల్లిపాయల తరుగు వేసి వేయించాలి. దీంతో పాటు పప్పు ముద్దను కూడా కలుపుకోండి. ఉడికించిన అరటికాయలను అందులో చేర్చి బాగా తగిన మోతాదు నీటిలో ఉడికిన తర్వాత దించుకోవాలి.