పెసరపప్పు, బియ్యం రెండూ కలిపి కొద్దిసేపు నానబెట్టాలి. సగం మిరియాలను కచ్చాపచ్చాగా దంచుకోవాలి (పగిలిన మిరియాల ఘాటు పొంగల్‌కు పడుతుంది). తర్వాత కడాయిలో నూనె+నెయ్యి వేసి మిరియాలు, జీలకర్ర, కరివేపాకు వేగించి, అందులోనే నీరు వడకట్టిన పెసరపప్పు, బియ్యం వేసి సన్నని సెగమీద కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి. తర్వాత 8 కప్పుల నీరుపోసి, తగినంత ఉప్పువేసి ఉడికించాలి. ఈ పొంగల్ని పెరుగు పచ్చడితో, లేదా పల్లీల పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటుంది.