గసగసాల పాయసం
  • 374 Views

గసగసాల పాయసం

కావలసినవి:

  • గసాలు - ఒక గ్లాసు
  • గోధుమపిండి - ఒకటిన్నర గ్లాసు
  • బియ్యం పిండి - రెండు స్పూన్‌లు
  • యాలకులు - రెండు
  • పంచదార - రెండున్నర గ్లాసులు
  • నెయ్యి - ఒక స్పూన్‌

విధానం:

ముందుగా ఒక గ్లాసు నీరు పోసి గసాలను మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. గోధుమపిండిని చపాతి పిండి మాదిరిగా తడిపి పెట్టుకోవాలి. పిండి అరగంట పాటు నానిన తరువాత సేమ్యా మాదిరిగా లావుగా తాల్చాలి. ఇప్పుడు ఒక పాత్రలో నాలుగు గ్లాసుల నీరు పోసుకోవాలి. నీరు మరిగాక అందులో తాల్చిన సేమ్యా వేసుకోవాలి. కాసేపు మరిగాక పంచ దార, రుబ్బిన గసాల పేస్టు వేసుకో వాలి. తరువాత మిగిలిన నీరు పోసి చిన్న మంటపై ఉడికించుకోవాలి. చివరగా బియ్యం పిండిని నీళ్లలో కలిపి పోయాలి. తరువాత నెయ్యి, యాలకులు వేసి దింపుకోవాలి. అంతే... గసగసాల పాయసం రెడీ.