పొటాటో బాల్స్‌
  • 432 Views

పొటాటో బాల్స్‌

కావలసినవి:

  • బంగాళదుంపలు - 3,
  • క్యారెట్‌, బీన్స్‌,క్యాబేజీ తురుము - 1 కప్పు
  • గుడ్డు - 1,
  • సన్న సేమ్యా - అరకప్పు
  • నూనె - వేయించడానికి సరిపడా,
  • ఉప్పు - తగినంత

విధానం:

క్యారెట్‌, బీన్స్‌, క్యాబేజీ తురుములో ఉప్పు కలిపి పెట్టుకోవాలి. బంగాళదుంపలను ఉడికించి ముద్దగా చేసుకుని అందులో ఉప్పు కలుపుకోవాలి. గుడ్డుసొన గిలకొట్టుకుని ఒక బౌల్‌లో ఉంచుకోవాలి. అలాగే సన్న సేమ్యాను ఒక ప్లేట్‌లో ఉంచుకోవాలి. అరచేతికి నూనె రాసుకుని నిమ్మకాయంత బంగాళదుంప ముద్దను తీసుకుని పరుచుకోవాలి. అందులో పైన చెప్పిన కూరగాయల తురుమును ఉంచి మూసివేసి బాల్స్‌లా చేసుకోవాలి. వాటిని గుడ్డుసొనలో దొర్లించి, తరువాత సేమ్యాలో కూడా దొర్లించి నూనెలో వేయించుకోవాలి. బంగారురంగులో వేగిన తరువాత తీసి టిష్యూ పేపర్‌ ఉంచిన ప్లేట్‌లో వేసుకోవాలి. కరకరలాడుతూ, రుచిగా ఉండే ఈ పొటాటో బాల్స్‌‌ను టమాటాసాస్‌తో కలిపి చిరుజల్లులు పడుతుండగా తింటుంటే ఆ మజానే వేరు!