పొటాటో బాస్కెట్
 • 435 Views

పొటాటో బాస్కెట్

కావలసినవి:

 • ఉడికించిన బంగాళదుంపలు - 3
 • ఉల్లిపాయ - 1
 • పచ్చి బఠాణీలు - 2 టీ స్పూన్లు
 • తెల్ల బఠాణీ లేదా కార్న్ -
 • 2 టీ స్పూన్లు
 • క్యారట్ ముక్కలు - 3 టీ స్పూన్లు
 • కొత్తిమీర - ఒక కట్ట
 • పెరుగు - 4 టీ స్పూన్లు
 • టొమాటో సాస్ - 3 టీ స్పూన్లు
 • చాట్ మసాలా పొడి -
 • 2 టీ స్పూన్లు
 • ఉప్పు - తగినంత
 • నూనె - వేయించడానికి తగినంత

విధానం:

ఆకుపచ్చ, తెల్ల బఠాణీలను అరగంట నానబెట్టి ఉప్పు వేసి ఉడికించాలి. బంగాళదుంపలను ఉడకపెట్టి, చల్లారాక చెక్కు తీసి మధ్యలోకి రెండుగా కట్ చేసుకోవాలి. ఒక చెంచాతో ఆ సగం బంగాళదుంపలోని మధ్యభాగం మెల్లిగా తీసేయాలి. దీనివల్ల ఆ దుంప ఒక బుట్ట లేదా గిన్నెలా కనిపిస్తుంది. పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక వీటిని వేడి నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ, క్యారట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ బంగాళదుంప బుట్టలలో క్యారట్, ఉల్లిపాయ, ఉడకబెట్టిన బఠాణీలు కొద్దికొద్దిగా వేసి పైన చిలికిన పెరుగు, టొమాటో సాస్, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి పైన చాట్ మసాలాపొడి చల్లి సర్వ్ చేయాలి.