పొటాటో గ్రీన్ ఖుర్మా
 • 413 Views

పొటాటో గ్రీన్ ఖుర్మా

కావలసినవి:

 • బంగాళదుంపలు - 4,
 • ఉల్లిపాయ - 2
 • కొబ్బరిపొడి - 3 టీ స్పూన్లు,
 • పెరుగు - అర కప్పు
 • కొత్తిమీర - ఒక కట్ట,
 • పుదీనా - చిన్న కట్ట
 • పచ్చిమిర్చి - 5 లేదా 6,
 • గరంమసాలా పొడి - పావు టీ స్పూను,
 • పసుపు - పావు టీ స్పూను
 • అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను,
 • నూనె - 4 టీ స్పూన్లు

విధానం:

పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, పెరుగు, కొబ్బరిపొడి ... వీటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బంగాళదుంపలను చెక్కుతీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెడల్పాటి పాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు (గ్రైండ్ చేసినా పరవాలేదు) వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి మరో రెండు నిముషాలు వేయించి బంగాళదుంప ముక్కలు వేసి ఐదు నిముషాలు చిన్న మంటపై వేయించాలి. ఇందులో గ్రైండ్ చేసిన మసాలా ముద్ద, తగినంత ఉప్పు, అరకప్పుడు నీళ్లు పోసి కలిపి మూతపెట్టాలి. కూర ఉడికి నూనె తేలినప్పుడు గరంమసాలా పొడి కలిపి దింపేయాలి. ఈ ఖుర్మా పులావ్, నాన్, చపాతీలలోకి బావుంటుంది.