పొటాటో మిక్స్చర్
 • 397 Views

పొటాటో మిక్స్చర్

కావలసినవి:

 • బంగాళదుంప తురుము - రెండు కప్పులు
 • కార్న్‌ఫ్లేక్స్ - కప్పు
 • పల్లీలు - పావు కప్పు
 • కరివేపాకు - రెండు రెమ్మలు
 • బఠాణీలు - పావుకప్పు
 • ఎండుమిర్చి - 4, పసుపు - చిటికెడు
 • కారంపొడి - రెండు టీ స్పూన్లు
 • ధనియాలపొడి - రెండు టీ స్పూన్లు
 • మిరియాలపొడి - చిటికెడు
 • పంచదార - రెండు టీ స్పూన్లు
 • ఉప్పు - తగినంత
 • నూనె - వేయించడానికి తగినంత

విధానం:

బంగాళదుంపలను చెక్కు తీసి కొద్దిగా లావుగా తురిమి పెట్టుకోవాలి. ఈ తురుమును నీళ్లలో వేసి కడిగి ఆరనివ్వాలి. తరవాత వేడినూనెలో కరకరలాడేలా వేయించాలి. కార్స్‌ఫ్లేక్స్, పల్లీలు, బఠాణీలు కూడా వేయించి పెట్టుకోవాలి. చివరగా ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేయించుకోవాలి. ఒక గిన్నెలో ఇవన్నీ వేసి కారంపొడి, ధనియాలపొడి, మిరియాలపొడి, పంచదార, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి.