బంగాళదుంపను చెక్కు తీసి తురిమి పెట్టుకోవాలి. పాన్లో కొద్దిగా నూనె వేడిచేసి ఈ తురుము వేసి కొద్దిసేపు వేయించాలి. వేగిన తరవాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యారట్ తురుములను కూడా అందులో వేసి కొద్దిగా వేయించాలి. తరవాత అందులో రెండుకప్పుల నీరు పోసి మరిగించాలి. ఇందులో మిరియాలపొడి, అజినమోటో, తగినంత ఉప్పు వేసి మరో ఐదు నిముషాలు మరిగించి, దింపేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.