పొటాటో - ఆనియన్ సూప్
  • 195 Views

పొటాటో - ఆనియన్ సూప్

కావలసినవి:

  • బంగాళదుంప (చిన్నది) - 1,
  • ఉల్లిపాయ (చిన్నది) - 1,
  • క్యారట్ తురుము - 2 టీ స్పూన్లు
  • మిరియాల పొడి - చిటికెడు,
  • అజినమోటో - చిటికెడు,
  • ఉప్పు - తగినంత,
  • వెన్న - టీ స్పూను

విధానం:

బంగాళదుంపను చెక్కు తీసి తురిమి పెట్టుకోవాలి. పాన్‌లో కొద్దిగా నూనె వేడిచేసి ఈ తురుము వేసి కొద్దిసేపు వేయించాలి. వేగిన తరవాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యారట్ తురుములను కూడా అందులో వేసి కొద్దిగా వేయించాలి. తరవాత అందులో రెండుకప్పుల నీరు పోసి మరిగించాలి. ఇందులో మిరియాలపొడి, అజినమోటో, తగినంత ఉప్పు వేసి మరో ఐదు నిముషాలు మరిగించి, దింపేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.