బంగాళాదుంప పకోడి
  • 469 Views

బంగాళాదుంప పకోడి

కావలసినవి:

  • బంగాళా దుంపలు - 2
  • శనగపిండి - 1 గ్లాసు
  • ఉల్లిపాయలు - 3
  • పచ్చిమిర్చి - 6
  • జీలకర్ర - 1 స్పూను
  • అల్లం - చిన్నముక్క
  • సోడా - పావు స్పూను
  • నూనె - పావుకిలో
  • ఉప్పు, కారం - తగినంత

విధానం:

బంగాళాదుంపలు శుభ్రంగా కడుక్కొని తొక్కుతీసి వేపుడు ముక్కల్లా చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఒక గిన్నెలో నీళ్లుపోసి మరగనివ్వాలి. స్టవ్‌ మీద నుండి కిందకు దించి, ఈ ముక్కలు రెండు నిమిషాలు మరిగే నీళ్ళలో ఉడకనివ్వాలి. తర్వాత నీళ్ళలో నుండి తీసి పక్కన పెట్టు కోవాలి. ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి చిన్నముక్కలుగా తరగాలి. ఈ ముక్కలలో శెనగపిండి, ఉప్పు, కారం, జీలకర్ర, సోడా కలపాలి. తర్వాత బంగాళ దుంప ముక్కలు కూడా వేసి కొద్దిగా నీళ్ళుపోసుకుని పిండి కలుపుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగాక పకోడీల్లా వేసుకుని ఎర్రగా వేపుకుని తీసుకోవాలి.