బియ్యం కడిగి పది నిముషాలు నాననివ్వాలి. గిన్నెలో నూనె, నెయ్యి కలిపి వేడి చేయాలి. అందులో నిలువుగా చీలికల్లా తరిగిన ఉల్లిపాయ వేసి మెత్తబడే వరకు వేయించాలి. తరవాత నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, పుదీనా ఆకులు, గరంమసాలా వస్తువులు, పచ్చిబఠాణీలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిసేపు వేయించాలి. ఇందులో ఒకటికి ఒకటిన్నర కొలతలో నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి మరిగించాలి. బియ్యాన్ని చల్ల నీటిలో నుంచి తీసి మరుగుతున్న నీటిలో వేసి ఉడికించాలి. బియ్యం ఉడికి నీరంతా ఇగిరిపోయాక మంట తగ్గించి మూతపెట్టి నిదానంగా మరో ఐదు నిముషాలు మగ్గనిచ్చి దింపేయాలి.