ఆలూ సూప్‌
 • 692 Views

ఆలూ సూప్‌

కావలసినవి:

 • బంగాళదుంపలు- 1/4 కిలో,
 • ఉల్లిపాయలు-2 పెద్దవిపచ్చి మిర్చి-3 కాయలు, చింతపండు- 50.గ్రా.
 • నూనె, పసుపు,
 • ఉప్పు,
 • బెల్లం- తగినంత,
 • వెల్లుల్లిపాయ- 1,
 • మెంతులు-1/2 చెంచా
 • కారం- 1 చెంచా,
 • తాలింపులు-తగినంత,
 • కరివేపాకు-తగినంత

విధానం:

చింతపండు కడిగి నీటిలో నానపెట్టాలి. బంగాళదుంపలు, పచ్చి మిర్చి, ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. గిన్నెలో నూనె పోసి కాగిన తర్వాత వెల్లుల్లి చిదిపి వేయాలి. తరువాత మెంతులు వేసి వేగాక తాలింపులు కరివేపాకు వేసి వేగిన తర్వాత తరిగిన ఉల్లి, దుంప, మిర్చి ముక్కలు కూడా వేసి కాస్త వేగిన తర్వాత చింతపండు రసం చిక్కగా చేసి పోయాలి. ముక్కలనీ ఉడికిన తర్వాత ఉప్పు, పసుపు, కారం కూడా వేసి బాగా మరగనిచ్చి కొత్తిమీర చల్లుకొని దింపుకోవాలి.