పులసల పులుసు
 • 435 Views

పులసల పులుసు

కావలసినవి:

 • పులస చేప.. ఒకటి
 • వెన్న.. ఒక టీ.
 • చింతపండు.. తగినంత
 • ధనియాలు.. రెండు టీ.
 • మెంతులు.. పావు టీ.
 • ఉల్లిపాయలు.. రెండు
 • పచ్చిమిర్చి.. ఆరు
 • ఆవనూనె.. 2 టీ.
 • ఉప్పు.. తగినంత
 • కారం.. రెండు టీ.
 • కరివేపాకు.. 2 రెబ్బలు
 • కొత్తిమీర.. కాస్తంత

విధానం:

పులస చేపని శుభ్రంచేసి కావలసిన సైజులో కట్‌చేసి పెట్టుకోవాలి. మెంతులు, ధనియాలు, జిలకర్ర, ఆవాలను మిక్సీలో వేసి మెత్తగా నూరుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను సన్నగా తరిగి ఉంచాలి. పాన్ వేడయ్యాక నూనె వేసి అందులో ఉల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగులను వేసి వేయించాలి. తరువాత అందులో మసాలా ముద్దను వేసి వేయించాలి. ఐదు నిమిషాల తరువాత చేప ముక్కలుల, ఆవనూనె, ఉప్పు, కారం వేసి వేయించాలి.

తరువాత తగినంత చింతపండు రసం పోసి ఉప్పు సరిజూసి ఉడికించాలి. ముక్క ఉడికాక దించే ముందు వెన్న, కరివేపాకులను వేసి దించేయాలి. అంతే పులస పులుసు తయార్..! ఈ పులస పులుసుకు ఒక విశేషం ఉంది. ఇది చాలా కరీదైన చేప అయినా, బ్రహ్మండమైన రుచి ఉంటుంది. కాబట్టి.. విశాఖ ప్రాంతంలో దీనిపై "పుస్తెలు తాకట్టు పెట్టయినా పులస పులుసు తినాలనే" సామెత కూడా పుట్టింది.