గుమ్మడి కోఫ్తా
 • 302 Views

గుమ్మడి కోఫ్తా

కావలసినవి:

 • గుమ్మడి తురుము - కప్పు
 • ఉడికించిన బంగాళాదుంపలు - రెండు
 • ఉల్లిపాయలు - రెండు,
 • కొత్తిమీర - కొద్దిగా
 • వెల్లుల్లి రేకులు - 4,
 • పచ్చిమిర్చి - 3
 • కార్న్‌ఫ్లోర్ - కప్పు, మైదా - రెండు కప్పులు
 • ఉప్పు - తగినంత
 • కారం - రెండు టీ స్పూన్లు
 • ధనియాల పొడి - రెండు టీ స్పూన్లు
 • గరం మసాలా - అర టీ స్పూను
 • కరివేపాకు - నాలుగురెమ్మలు
 • జీడిపప్పు - 20 గ్రా., నూనె - తగినంత

విధానం:

ఒక బౌల్‌లో గుమ్మడి తురుము, ఉడికించిన బంగాళాదుంపలు, ఉల్లితరుగు, వెల్లుల్లి రేకులు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, కార్న్‌ఫ్లోర్, మైదా, ఉప్పు, కారం, గరంమసాలా, కరివేపాకు, జీడిపప్పు వేసి గట్టిగా పకోడీల పిండిలా కలుపుకుని చిన్నచిన్న ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి. స్టౌ మీద బాణలిలో నూనె కాగిన తరవాత ఈ ఉండలను అందులో వేసి వేయించి సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోవాలి.గుమ్మడి కోఫ్తాని టొమాటో సాస్, కొత్తిమీరలతో గార్నిష్ చేయాలి.