పంజాబీ ఖడీ
 • 424 Views

పంజాబీ ఖడీ

కావలసినవి:

 • శనగపిండి - 200 గ్రా
 • ఉల్లిపాయలు - రెండు (తరగాలి)
 • బంగాళదుంపలు- రెండు (ఉడికించాలి),
 • వాము - 10 గ్రా,
 • మిరప్పొడి - 30 గ్రా,
 • సన్నగా తరిగిన అల్లం ముక్కలు - 15 గ్రా,
 • సన్నగా తరిగిన కొత్తిమీర - ఒక కప్పు,
 • నూనె - అర కప్పు,
 • సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు - 20గ్రా,
 • పెరుగు - కప్పు,
 • ఉప్పు - 15 గ్రా,
 • ఎండుమిర్చి - 10 గ్రా,
 • పసుపు - 15 గ్రా,
 • ఇంగువ - 5 గ్రా,
 • ఆవాలు - 5 గ్రా,
 • జీలకర్ర - 5 గ్రా,
 • పచ్చిమిర్చి -10 గ్రా.

విధానం:

ఒక పాత్రలో శనగపిండి, సగం ఉల్లిపాయ ముక్కలు, చిదిమిన బంగాళదుంప, సగం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ముక్కలు, పసుపు, జీలకర్ర, ఉప్పు, వాము వేసి తగినంత నీటితో ముద్దగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న పకోడీలుగా చేసుకుని మరుగుతున్న నూనెలో వేసి వేయించి తీసి పక్కన పెట్టాలి. మరొక పాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేయాలి. అవి వేగిన తర్వాత పెరుగు కలపాలి. అందులో మిరప్పొడి, పసుపు, ఉప్పు, ఇంగువ వేసి వేయించాలి. ఈ మిశ్రమంలో ముందుగా వేయించి పక్కన ఉంచిన పకోడీలను వేసి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.