పెసరపప్పుని, ముల్లంగిముక్కల్ని విడివిడిగా ఉడికించాలి. పప్పుని మెత్తగా రుబ్బుకోవాలి. ముల్లంగి ముక్కల్ని మెదపకూడదు. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి దంచి పెట్టుకోవాలి. ఒక పాత్రలో ముల్లంగి ముక్కలు, పెసరపప్పు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసి 2 కప్పుల నీరుపోసి మరిగించాలి. కడాయిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఇంగువ, కరివేపాకుతో తాలింపు పెట్టి రసాన్ని కలపాలి. వేడి వేడి అన్నంలో ఈ రసం ఎంతో రుచిగా ఉంటుంది