రంజాన్ స్పెషల్ మటన్ కుర్మా
 • 465 Views

రంజాన్ స్పెషల్ మటన్ కుర్మా

కావలసినవి:

 • మటన్ - పావు కేజీ
 • ఉడికించిన బంగాళదుంప - 1
 • ఉప్పు - తగినంత
 • మిరప్పొడి - 2 టీ స్పూన్లు
 • గరం మసాలా - టీ స్పూన్
 • నూనె - తగినంత
 • కొత్తిమీర - 2 టీ స్పూన్లు
 • పెరుగు - అర కప్పు

గ్రేవీకోసం:

 • కొబ్బరిపొడి - 2 టీ స్పూన్లు
 • వేయించిన పల్లీలు - 20 గ్రా
 • గరంమసాలా - టీ స్పూను
 • వేయించిన నువ్వులు - రెండు టీ స్పూన్లు
 • బాదంపలుకులు - పది

విధానం:

గ్రేవీకోసం పైన చెప్పిన పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగిన తరవాత అందులో ఈ గ్రేవీ మిశ్రమాన్ని వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి. అల్లంవెల్లుల్లి పేస్ట్, మిరప్పొడి వేసి మరోసారి కలపాలి. తరువాత మటన్ వేసి అది మెత్తగా మగ్గిన తరువాత చిదిమిన బంగాళదుంప, పెరుగు, గరం మసాలా, ఉప్పు, తగినంత నీరు పోసి బాగా ఉడకనివ్వాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.