మామిడి రసగుల్లా
  • 407 Views

మామిడి రసగుల్లా

కావలసినవి:

  • మామిడిపండ్లు - 2 (పెద్దవి)
  • మైదా - 2 కప్పులు,
  • నెయ్యి - పావుకిలో
  • పాలు - 1/2 కప్పు,
  • పంచదార - 1 కప్పు
  • కోవా - 150 గ్రాములు,
  • యాలకుల పొడి - 1 స్పూన్‌

విధానం:

మామిడి పండ్లు శుభ్రంగా కడిగి రసం తీసి పెట్టుకోవాలి. గిన్నెలో మైదా, కోవా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వుండలుగా చేసి నేతిలో వేయించాలి. మామిడి రసంలో యాలకుల పొడి, వేయించిన మైదా ఉండల్ని వేసి అరగంట నాననివ్వాలి. అంతే మామిడి రసగుల్లా రెడీ. చల్లగా ఇష్టపడేవారు ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు (వీటికి తియ్యగా, గట్టిగా ఉండే మామిడి పండ్లయితే బాగుంటాయి).