రసమలై
  • 627 Views

రసమలై

కావలసినవి:

  • పాలు(వెన్నశాతం ఉన్నవి) - లీటరు
  • పాలపొడి - 2 కప్పులు
  • గుడ్డు - 1
  • పంచదార - 100 గ్రా.
  • బాదం, జీడిపప్పు, కిస్‌మిస్ - గార్నిష్ కోసం తగినన్ని

విధానం:

ఒక వెడల్పాటి గిన్నెలో పాలు పోసి, అర లీటర్ అయ్యేంతవరకు సన్నని సెగ మీద మరిగించాలి.
మరొక గిన్నెలో గుడ్డు సొన వేసి, గిలకొట్టాలి. ఇందు లో పాల పొడి నెమ్మదిగా పోస్తూ బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు కట్టి, మరుగుతున్న పాలలో వేయాలి. కొన్ని నిమిషాలసేపు వేడి మీద ఉంచాలి. మంట తీసేసి, చల్లారనివ్వాలి. సర్వ్ చేసే ముందు వేయించిన బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌లతో గార్నిష్ చేయాలి.