రవ్వ బొబ్బట్లు
  • 944 Views

రవ్వ బొబ్బట్లు

కావలసినవి:

  • కావలసిన పదార్థాలు
  • బొంబాయి రవ్వ - పావు కిలో
  • పంచదార - పావుకిలో
  • యాలకుల పొడి - 1 చెంచా
  • నీళ్లు - 2 గ్లాసులు
  • మైదా - పావు కిలో, నెయ్యి - తగినంత

విధానం:

 

మైదా పిండిలో నీళ్లు, ఉప్పు వేసి పూరీపిండిలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. బొంబాయి రవ్వ, నీళ్లు, పంచదార కలిపి స్టవ్‌ మీద పెట్టి ఉండకట్టకుండా కలుపుతూ ఉండాలి. బాగా ఉడికిన తరువాత దించి, చల్లారాక ఉండలు చేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న మైదాతో అరచేయంత పూరీలు చేసుకోవాలి. రవ్వ ముద్దను అందులో పెట్టి చుట్టూ పిండితో కవర్‌ చెయ్యాలి. ప్లాస్టిక్‌ కవర్‌ పై నూనె రాసి ఆ ముద్దను చపాతీలా ఒత్తుకోవాలి. వీటిని నెయ్యి వేసి పెనం మీద కాల్చుకోవాలి.